TTD:వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు

7
- Advertisement -

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశి పర్వదినాల‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 2.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు తిరిగి 5 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

అదేవిధంగా డిసెంబ‌రు 31న వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా ఉద‌యం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. ఉద‌యం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు తిరుచ్చి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.

ఆంగ్ల నూత‌న సంవ‌త్స‌రాది 2026 జనవరి 1న‌ వేకువజామున 1 గంట నుండి 4 గంటల‌ వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 4 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

Also Read:Harish:డిసెంబర్ 9.. విజయ్ దివాస్

- Advertisement -