- Advertisement -
తిరుమలకు భక్తులు పోటెత్తడంతో సర్వదర్శనం స్లాట్‌ను రద్దుచేసింది టీటీడీ. రోజువారిగా జారీ చేసే సర్వదర్శనం టికెట్ల క్యూలైన్ వద్ద నిన్న తొక్కిసలాట జరుగగా పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సర్వదర్శనం స్లాట్ విధానాన్ని రద్దు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు.
కరోనాకు ముందున్న విధాన్ని తిరిగి ప్రవేశపెడుతున్నామని… వైకుంఠంలో వేచివున్న భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టికెట్లు లేకుండా వచ్చేవారితో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి.
వైకుంఠం-2 వెలుపల క్యూలైన్లలో భక్తులు బారులు తీరుతున్నారు. టికెట్లు లేకుండా నేరుగా వచ్చిన భక్తులకు నేటినుంచి దర్శనం కల్పించనున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో విఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు మూడు రోజులపాటు ఆర్జిత సేవలను టీటీడీ నిలిపివేసింది.
- Advertisement -