శివాజీ బొమ్మపై ఎలాంటి నిషేధం లేదు : టీటీడీ

56
ttd
- Advertisement -

అధికారుల నిర్వాకం వల్ల తిరుమలలో మహారాష్ట్రలో తలెత్తిన వివాదాన్ని సరిదిద్దేందుకు రంగంలోకి దిగింది టీటీడీ. తిరుమలలో ఛత్రపతి శివాజీ బొమ్మపై ఎలాంటి నిషేధం లేదని టీటీడీ వెల్లడించింది . టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది అత్యుత్సాహం కారణంగా అలిపిరి దగ్గర మహారాష్ట్ర భక్తుల వాహనంపై శివాజీ బొమ్మను తొలగించారు.

ఇది వివాదానికి దారితీసింది. దీంతో మహారాష్ట్రలో విమర్శలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఛత్రపతి శివాజీ బొమ్మపై ఎలాంటి నిషేధం లేదని ప్రకటించారు ఈవో ధర్మారెడ్డి.

- Advertisement -