TTD:కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా లక్షబిల్వార్చన

53
- Advertisement -

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులోభాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు.

సాయంత్రం శ్రీ చంద్ర‌శేఖ‌ర స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నారు.

Also Read:సూపర్ మెన్ ఫోజ్…ఎన్ని లాభాలో!

- Advertisement -