తిరుమల లడ్డూ..షాకింగ్ నిజాలు!

6
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసినది కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదని తేలింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ కోర్టుకు తెలిపింది.

నిజానికి భోలేబాబా డెయిరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేవని స్పష్టం చేసింది సీబీఐ సిట్‌. తమ నుంచి పాలు సేకరించలేదని రైతులే చెప్పారంది. ముందుగా రచించిన ప్రణాళిక ప్రకారమే ఏఆర్‌ డెయిరీ, వైష్ణవీ డెయిరీ ముందుపెట్టి భోలేబాబా డెయిరీ వ్యవహారాన్ని నడిపింది

ఈ నెయ్యి మాఫియా ..సాక్షుల్ని బెదిరిస్తోంది. సాక్షులు వేసినట్లుగా తప్పుడు పిటిషన్లు వేస్తోంది. ఎవరూ సీబీఐ సిట్ ముందు హాజరు కాకుండా.. కాపలా కాస్తున్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న సంజీవ్‌ జైన్‌ తిరుపతి ఎయిర్ పోర్టులో దిగితే అతన్ని కిడ్నాప్ చేసి..చెన్నై తీసుకెళ్లి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించారట.అసలు ఆ నెయ్యిని టీటీడీ ఎందుకు తీసుకుంది అన్న దగ్గర నుంచి పూర్తి వివరాలను సీబీఐ సిట్ త్వరలోనే బయట పెట్టనుంది.

Also Read:Kannappa:కన్నప్పలో రజనీకాంత్!

- Advertisement -