Kannappa:కన్నప్పలో రజనీకాంత్!

13
- Advertisement -

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు రజనీకాంత్. ఈ సినిమాలో మోహ‌న్‌బాబు లాగానే మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను తీసుకుందామ‌నుకున్నాం… ఈ రోల్ కోసం సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌ని తీసుకోవాలని భావించినట్లు విష్ణు వెల్లడించారు.

అయితే ఈ రోల్ కథకు సంబంధం లేకుండా ఎక్కువైపోతుందేమోనని చిత్ర‌బృందం భావించ‌డంతో ఆ పాత్రను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభాస్‌కు రెండు పాత్ర‌లను ఆఫ‌ర్ చేయ‌గా.. అత‌డు రుద్ర రోల్‌పై ఆస‌క్తి చూపిన‌ట్లు విష్ణు వెల్ల‌డించారు. ప్రభాస్‌ను శివుడి పాత్ర కోసం అనుకోలేదని వచ్చిన ఊహాగానాలను కూడా విష్ణు ఖండించారు.

Also Read:కాళేశ్వరం కమిషన్‌ విచారణకు ఈటల

- Advertisement -