TTD: 10న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

6
- Advertisement -

తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 10న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టనున్నారు. ఈ కార‌ణంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌ను ర‌ద్దు చేశారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుండి 18వ‌ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌రు 15న సాయంత్రం ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

సెప్టెంబ‌రు 16న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న మహాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు.

Also Read:జర్నలిస్టులు అందరికి ఇళ్ల స్థలాలు: సీఎం రేవంత్

- Advertisement -