భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి

8
- Advertisement -

తిరుమల భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక విజ్ఞప్తి చేశారు. భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలి.. దర్శనం లేదా వినతి కోసం ఏ మధ్యవర్తులను సంప్రదించొద్దు అని సూచించారు.

భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.. భక్తులను మోసం చేస్తున్న దళారీలపై చర్యలు తీసుకోవడానికి టీటీడీ ప్రత్యేక డ్రైవ్ ను కూడా ప్రారంభించింది అన్నారు.తిరుమలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచడానికి మనమంతా కలిసి కృషి చేద్దాం అని కోరారు బీఆర్ నాయుడు.

మరోవైపు శ్రీవారి దర్శనం కోసం తిరుమలలో 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 66,675 మంది భక్తులు దర్శించుకోగా 24,681 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.32 కోట్లుగా ఉంది.

Also Read:BB9:కెప్టెన్సీ కోసం వింత టాస్క్‌లు

- Advertisement -