బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 40 రోజులు పూర్తి చేసుకుంది. కెప్టెన్సీ కోసం టాస్కులు జరుగగా కెప్టెన్సీ కోసం మీరు చేస్తున్న ఈ యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళాల్సిన అవసరం ఉంది.. ఎందుకంటే ఈ ఇంట్లో మొదటిసారిగా ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు ఉండబోతున్నారు.. అంటూ బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆ ఇద్దరు కెప్టెన్లు వారికి లభించబోయే ప్రయోజనాలను మరియు బాధ్యతలను పంచుకోబోతున్నారు .. కాబట్టి మీ భాగస్వామిని చాలా జాగ్రత్తగా ఎంచుకోండి అంటూ బిగ్‌బాస్ సూచనలు చేశాడు.
నిన్న జరిగిన టాస్కులో తమ కంటెండర్‌షిప్ కాపాడుకొని నిలిచిన ఆరుగురు సభ్యులు ఇప్పుడు కెప్టెన్ అవ్వడానికి పాల్గొనాల్సిన టాస్క్ విడిపించు.. గెలిపొందు..ఈ టాస్కులో గెలిచిన జంటలోని ఇద్దరు సభ్యులు హౌస్ కెప్టెన్లు అవుతారు.. ఈ టాస్క్‌లో భాగంగా ప్రతి జంటలోనూ ఒకరు యాక్టివిటీ ఏరియాలో ఉన్న సమాధి లోపల లాక్ అయి ఉంటారు.. ముందుగా ఎవరు తమ పార్టనర్‌ని విడుదల చేస్తారో వాళ్లు ఈ టాస్కు విజేతలు అవుతారు అని బిగ్‌బాస్ చెప్పాడు.
ఈ టాస్కు ఇలా మొదలుకాగానే చకచాకా కేజ్ నుంచి వాకీ టాకీ తీసుకొని మాధురి ఇచ్చిన సూచనల ప్రకారం గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ కూడా ఓపెన్ చేసేసింది అయేషా. అలానే పరిగెత్తుకొని లోపలికి అయితే వెళ్లింది. కానీ అక్కడ మాధురి ఉన్న సమాధికి ఏర్పాటు చేసిన తాళానికి కావాల్సిన పాస్ వర్డ్ రాంగ్ ఎంటర్ చేసింది. దీంతో అది ఓపెన్ కాలేదు. తర్వాత సుమన్ శెట్టి పడుకున్న బాక్స్‌ని ఓపెన్ చేశాడు. దీంతో పరిగెత్తుకుంటూ ఇద్దరూ వెళ్లి గంట కొట్టేసి విన్ అయిపోయారు.
సుమన్ శెట్టితో పాటు గౌరవ్ కూడా కెప్టెన్ అయ్యాడు. ఈ సంతోషం బావుంది అనేలోపే బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్ మీ దగ్గరున్న కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్ అయ్యే సమయం వచ్చింది.. కొత్త కెప్టెన్స్ ఇద్దరిలో నుంచి మీరు ఒకరిని నేరుగా ఛాలెంజ్ చేయొచ్చు.. ఆ ఛాలెంజ్‌లో మీరు గెలిస్తే వారి స్థానంలో మీరు కెప్టెన్ అవుతారు.. అని బిగ్‌బాస్ చెప్పాడు.
Also Read:42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ బంద్

