- Advertisement -
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే ప్రవేశ పెట్టిన గోవింద కోటి లిఖిత కార్యక్రమం ఆచరణలోకి తేవడానికి బుధవారం తొలి అడుగుపడింది. వినాయక సాగర్ లో ఏర్పాటు చేసిన గోవింద కోటి వినాయకుడి సాక్షిగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి భక్తులకు గోవింద కోటి పుస్తకాలు పంపిణీ చేశారు.
విఘ్నాలను హరించే వినాయకుడే గోవింద కోటి రాస్తున్నట్లుగా తయారు చేసిన విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంది. కరుణాకర రెడ్డి ముందుగా వినాయకుడి పూజలో పాల్గొన్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన మండపం నలువైపులా గోవింద కోటి నామం రాయడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. వినాయకుడు ప్రజలందరికీ శుభం జయం కలిగించాలని వేంకటేశ్వర స్వామి, వినాయకుడి ఆశీస్సులతో తిరుపతి నగరం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కరుణాకర రెడ్డి ప్రార్థించారు.
Also Read:బాలయ్య షో నుంచి బిగ్ అప్డేట్
- Advertisement -