TTD: స్వచ్ఛతకు మారుపేరు తిరుమల

2
- Advertisement -

ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు మరింత త్వరగా, సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో సేవలందించాల‌ని ఈవో జె.శ్యామలరావు అన్నారు. టిటిడి నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం అన్నారు.

ఈ ఏడాది అక్టోబర్‌ 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకుగాను జూలై 22వ తేదీ నుండి ఆఫ్‌ లైన్‌లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లను మాత్రమే జారీ చేయాలని నిర్ణయించాం అన్నారు. శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900, మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో జారీ చేస్తున్నాం అన్నారు.

తిరుమలలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని మరింత పెంచేందుకు నాణ్యమైన బియ్యం, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. అదేవిధంగా తిరుమలలో తాగునీరు, అన్నప్రసాదాలు, ముడిసరుకులను ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆధ్వర్యంలో అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా తిరుమలలో భక్తులకు నాణ్యమైన భోజనం అందించేందుకు హోటల్స్‌ వారికి అవసరమైన ట్రైనింగ్‌ ఇస్తున్నాం అన్నారు.

శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జితసేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేక మంది దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఇటీవల కాలంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా కొంతమంది మధ్యవర్తులు ఎక్కువసార్లు పొందినట్లు గుర్తించాము. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. కావున భక్తులు ఇటువంటి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరుతున్నాం అన్నారు. తిరుమల స్వచ్ఛతకు మారుపేరు. తిరుమలలో పరిశుభ్రతను మెరుగ్గా ఉంచడానికి ఎప్పటికప్పుడు మెరుగైన చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.

Also Read:‘ఆయ్’ పెద్ద హిట్ కావాలి: నిఖిల్

- Advertisement -