తిరుమలలో ఘన వ్యర్థాల నిర్వహణపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తను ఉపయోగించి బయో గ్యాస్, ఎరువులు తయారు చేయడం కోసం టీటీడీ–ఐఓసీఎల్ భాగస్వామ్యంతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విభజన అవసరం లేకుండా ఏవిధంగా వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయగలమో అలాంటి పద్ధతులను అన్వేషించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ శాస్త్రవేత్త పద్మశ్రీ శరద్ ఖలే, బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను ఉపయోగించి బయో గ్యాస్ ఉత్పత్తి చేయడం పర్యావరణ అనుకూల పరిష్కారం అని పేర్కొన్నారు. త్వరలో టీటీడీకి అనువైన ప్రణాళికను అందజేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కూరగాయల వ్యర్థాలతో ఇళ్లలోనే సేంద్రీయ ఎరువులు తయారీ విధానాన్ని ప్రదర్శించారు.
Also Read:భారత ఆర్మీ..డేర్ డెవిల్ ఆపరేషన్

