ఆఫ్ లైన్ శ్రీవాణి టికెట్లను ఉదయం 10:30 గంటలకు జారీ చేసి… సాయంత్రం 4:30 గంటలకు దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు టీటీడీ డిప్యూటీ ఈవో వెంకయ్య చౌదరి. ప్రస్తుత శ్రీవాణి ఉన్న సిస్టం ద్వారా భక్తులు మూడు రోజుల పాటు సమయం తిరుమలలో కేటాయించాల్సి ఉంది అని… ఈ కారణంగా గదులపై అధిక భారం పడుతోంది అన్నారు.
భక్తుల ఫీడ్ బ్యాక్, స్టేక్ హోల్డర్స్ సలహాలు సూచనలతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం… ప్రయోగాత్మకంగా రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం అన్నారు. ఉదయం శ్రీవాణి టికెట్లకు కేటాయించే 1 గంట సమయాన్ని… ఎస్ఎస్డి, సర్వదర్శనానికి కేటాయిస్తాం .. శ్రీవాణి భక్తులు అదే రోజు వచ్చి అదే రోజు వెళ్లిపోయే వీలు ఉంటుంది అని చెప్పారు.
ప్రయోగాత్మకంగా నిర్వహించే సమయంలో డేటా తీసుకొని… భక్తుల ఫీడ్ బ్యాక్ తీసుకున్న అనంతరం కొన్ని మార్పులపై నిర్ణయం తీసుకుంటామని…. ఆన్లైన్ లో మూడు నెలల ముందే టైమింగ్స్ జారీ చేశాం… మూడు నెలల పాటు ఆన్లైన్ శ్రీవాణి సమయంలో ఎలాంటి మార్పు లేదు అన్నారు. నవంబర్ 1 నుంచి ఆన్లైన్, ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శనానికి ఒకే సమయం ఉంటుంది… నిర్దేశించిన సమయంలోనే భక్తులు క్యూ కాంప్లెక్స్ కు చేరుకోవాలి అన్నారు.
Also Read:వాతావరణ కాలుష్యంపై సంతోష్ కుమార్

