యువకులైన శ్రీవారి సేవకులు క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన అనేక కార్యక్రమాలతో పాటు ధార్మిక మరియు ఎస్వీబిసి కార్యక్రమాలు బాగున్నాయని భక్తులు ప్రశంసల వర్షం కురిపించారు.
తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
1. వెంకటేశ్వర రావు – హైదరాబాద్
ప్రశ్న : శ్రీవారి సేవకుల వయస్సు 60 సంవత్సరాల పుండి 65 సంవత్సరాలు చేయండి.
ఈవో : ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సేవలందించడానికి 60 సంవత్సరాలలోపు వారైతే బాగా సేవలందిస్తారు.
2. రామలక్ష్మీ – నంద్యాల
ప్రశ్న : శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రెండే ఇస్తున్నారు. ప్రతి భక్తుడికి 10 ఇచ్చేలా చర్యలు తీసుకొండి,
ఈవో : శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ అందిస్తున్నాం. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాల్లో తప్ప, మిగిలిన సమయంలో భక్తులు కావాలసినన్ని లడ్డూలు పొందవచ్చు.
3. వెంకటేష్ – హైదరాబాద్
ప్రశ్న: శ్రీవారి లడ్డూ పరిమాణం తగ్గింది. రేటు తగ్గించండి.
ఈవో : లడ్డూ బరువు, పరిమాణం తగ్గలేదు, రేటు తగ్గించడానికి అవకాశం లేదు.
4. నాగేశ్వరరావు – హైదరాబాద్
ప్రశ్న : మా స్నేహితులు ఇటీవల అమెరికా నుండి శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనానంతనం తిరుమలలోని టీటీడీ బుక్ స్టాల్‌లో రూ. 111/- విలువ గల ఒక గోవింద నామాల పుస్తకాన్ని అడిగితే, అక్కడ సిబ్బంది బలవంతంగా ఒక్కొక్కటి రూ.150/- వంతున రెండు పుస్తకాలు ఇచ్చారు.
ఈవో : దీనిపై పరిశీలించి విధులలో ఉన్న సిబ్బందిపై చర్య లు తీసుకుంటాం.
4. ధనంజయ – చెన్నై
ప్రశ్న : ఫిబ్రవరి 24న తిరుపతి జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా నిర్వహించారు. టీటీడీలోని అన్ని కార్యలయాల్లో శ్రీ భగవత్ రామానుజచార్యులు ఫోటో పెట్టండి.
ఈవో : ప్రస్తుతం శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి ఫోటోలు మాత్రమే ఉంటాయి. మీ సలహాన్ని ఆగమ సలహా మండలికి విన్నవిస్తాం.
5. తిరుమల రెడ్డి – తిరుపతి
ప్రశ్న : 2009లో అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లు కొనుగోలు చేశాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సేవకు రాలేకపోయాం. తిరిగి టికెట్లు కేటాయించండి.
ఈవో : అష్టదళ పాదపద్మారాధన టికెట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయి. పరిశీలిస్తాం.
6. సుధాకర్ – గుంతకల్లు రవీంద్ర – హైదరాబాద్
ప్రశ్న : శ్రీవారిని దగ్గరగా చూసే అవకాశం కల్పించండి.
ఈవో : విఐపి సిఫారస్సు లేటర్లు, శ్రీవాణి ట్రస్టు ద్వారా టికెట్లు కొనుగోలు చేసి బ్రేక్ దర్శనం పొందవచ్చు.
7. తులసీ – బెంగుళూరు
ప్రశ్న : ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టోకెన్లు, ఆర్జిత సేవలు, రూ.300/- టికెట్లు సెంకడ్లలో అయిపోతున్నాయి. ఎన్ని సార్లు ప్రయత్నించిన పొందలేక పోతున్నాం.
ఈవో: శ్రీవారిపై ఉన్న అచంచల భక్తి వల్ల టికెట్లు త్వరగా అయిపోతున్నాయి. అప్పటికి మేము టికెట్ల బుకింగ్‌ను క్లౌడ్‌లో ఉంచుతున్నాం. మా వ్యవస్థ చాలా పారదర్శకంగా, పటిష్టంగా, అద్బుతంగా పనిచేస్తోంది.
8. నాగేంద్ర – గుంటూరు
ప్రశ్న : సేవా, దర్శనం టికెట్లతో పాటు వసతి బుక్ చేసుకునే అవకాశం కల్పించండి.
ఈవో : ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దర్శనం, సేవా టికెట్లు పొందిన భక్తులకు వసతి అందుబాటులోకి వస్తుంది.
9. వెంకటేష్ – వరంగల్
ప్రశ్న : గతంలో శ్రీవారి సేవకులకు చివరి రోజు సుపథం గుండా దర్శనం కల్పిస్తున్నారు. దానిని పునరుద్దరించండి.
ఈవో : ఇదివరకు సుపథం ఉండేది, ప్రస్తుతం రూ.300/- క్యూ లైన్‌లోనే శ్రీవారి సేవకులకు దర్శనం కల్పిస్తున్నాం.
Also Read:ఏపీలో బీజేపీ కాపు మంత్రం!
10. నిఖిలేష్ – నెల్లూరు
ప్రశ్న : ఎస్వీబిసిలో కార్యక్రమాలు చాలా బాగున్నాయి. అదేవిధంగా నాదనీరాజనం వేదికపై విద్యార్థులకు పురాణాలపై పోటీలు నిర్వహిస్తే యువతలో భక్తి భావం పెరుగుతుంది.
ఈవో : విద్యార్థులకు భగవద్గీత పోటీలు, ఎస్వీబిసిలో అన్నమయ్య, వెంగమాంబ సంకీర్తనలపై పోటీలు నిర్వహించి శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. విద్యార్ధులకు అందించేందుకు భగవద్గీతను ఐదు బాషలలో 15 పేజిలతో కోటి పుస్తకాలను ముద్రిస్తున్నాం.