ఆరోజుల్లో కేవలం సర్వదర్శనాలు మాత్రమే: టీటీడీ

98
ttd
- Advertisement -

సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా గ్రహణ సమయంలో రెండు రోజులపాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 25న సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఉంటుందని, నవంబర్‌ 8న చంద్రగ్రహణ కారణంగా ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ రెండు రోజుల పాటు గ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -