TTD:దళిత గోవిందం

51
- Advertisement -

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ ప్ర‌మాణస్వీకారం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. అనంతరం అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయ, ఆశీస్సులతో ఊహించని విధంగా త‌న‌కు రెండవ సారి టీటీడీ చైర్మన్ గా పనిచేసే మహద్భాగ్యం దక్కింద‌న్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను వెల్లడించారు.

ద‌ళిత గోవిందం

గ‌తంలో తాను ఛైర్మ‌న్‌గా ప‌నిచేసిన కాలంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీదేవి, భూదేవిని దళితవాడలకు తీసుకుని వెళ్ళి అక్కడే కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌న్నారు.

భాగవంతున్నే భక్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశీస్సులు అందించేలా, స్వామివారి కల్యాణాన్ని వారంతా చూసి ఆనందించేలా శ్రీనివాస కళ్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించిన‌ట్టు చెప్పారు.పిల్లల పెళ్ళిళ్ళకు అప్పులు చేసి ఆర్థికంగా చితికి పోతున్న పేద, మధ్య తరగతి వర్గాల వారికి చేయూత నివ్వడానికి కళ్యాణమస్తు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించామ‌న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 32 వేలకు పైగా జంటలకు స్వామివారి సమక్షంలో పెళ్ళి చేసి ఆయన ఆశీస్సులు అందింపజేశామ‌ని, త‌ద్వారా మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు ప్ర‌య‌త్నించామ‌ని వివ‌రించారు.

Also Read:కడుపులో నులిపురుగులా.. ఇలా చేయండి!

2006 కు ముందు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే అన్నదానం లో భోజనం చేసే అవకాశం ఉండేద‌న్నారు. త‌మ‌ హయాంలో దర్శనంతో సంబంధం లేకుండా కొండ మీదకు వచ్చిన ప్రతి భక్తుడు రెండు పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం కల్పించామ‌న్నారు.తిరుమల ఆలయ పవిత్రతను కాపాడటానికి నాలుగుమాడ వీధుల్లో పాదరక్షలతో ప్రవేశాన్ని నిషేధించిన‌ట్టు తెలిపారు.చంటిబిడ్డలతో స్వామివారి దర్శనానికి వచ్చే తల్లులు క్యూ లైన్లలో చాలా ఇబ్బందిపడే వార‌ని, దీన్ని గమనించి చంటిబిడ్డ తో పాటు తల్లికి మహాద్వారం పక్కన కుడివైపు నుండి ప్ర‌త్యేక లైన్ ద్వారా ఆలయంలోకి వెళ్ళేలా నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు.

Also Read:Tirumala:సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్యం

- Advertisement -