పృథ్వీ ఆడియోటేపు వ్యవహారంపై స్పందించిన టీటీడీ చైర్మన్

421
Subbareddy-and-Prudhvi
- Advertisement -

ఎస్వీబీసీ చైర్మన్, ప్రముఖ నటుడు పృధ్వీ ఆడియోటేపు వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళా ఉద్యోగితో పృధ్వీ అసభ్యకరంగా మాట్లాడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తుంది. తాజాగా అంశంపై స్పందించారు మాజీ ఎంపీ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఈ విషయం గురించి తెలిసిన వెంటనే పృథ్వీతో మాట్లాడానని చెప్పారు. ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని, తనను అవమానించేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని, తన గొంతును ఎవరో అనుకరించిరనట్టు ఆ వీడియోలో తెలుస్తోందని పృథ్వీ తనతో చెప్పాడని అన్నారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ఈవ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకొలేమన్నారు. దీనిపై విచారణకు టీటీడీ సీవీఎస్‌వోకు ఆదేశించానని, నివేదిక అందిన తర్వాత సీఎంకు తెలియజేస్తామని అన్నారు. మరోవైపు ఆడియో టేపులో ఉన్న వాయిస్ తనది కాదని చెప్పారు పృధ్వీ. తనకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి రావడం కొంత మందికి ఇష్టం లేదని..తనపైన కొపంతో కొంత మంది కావాలని నాపైన ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు.

- Advertisement -