సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మీక మందన కధానాయికగా నటించింది. దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. విజయశాంతి కీలక పాత్రలో నటించిన ఈచిత్రం జనవరి11న గ్రాండ్ విడుదలైంది. మొదటి షో నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో భారీగా కలెక్షన్లను రాబట్టింది.

ఈమూవీ తొలి రోజున రూ. 32.77 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. నైజాంలో రూ.8.66కోట్లు, సీడెడ్ రూ.4.15 కోట్టు, కృష్ణా రూ.3.07కోట్లు, ఉత్తరాంధ్ర రూ.4.4 కోట్లు, గుంటూరు రూ.5.15 కోట్లు, ఈస్ట్ రూ.3.35 కోట్లు, వెస్ట్ రూ. 2.72 కోట్లు, నెల్లూరు రూ.1.27 కోట్లు వసూళ్లను సినిమా సాధించింది. ఈ కలెక్షన్స్ మహేష్ కెరీర్ లోనే బెస్ట్ నైజాం ఫస్ట్ డే ఓపెనింగ్‌గా నిలిచాయి. అయితే నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ రూపంలో.. ప్రభాస్ సాహో మొదటి స్థానంలో ఉండగా… బాహుబలి 2, సైరా తరువాత రెండు స్థానాల్లో ఉన్నాయి.

