TTD:సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్యం

38
- Advertisement -

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి విచ్చేసే వేలాది మంది భ‌క్తుల‌కు తిరుప‌తిలో మ‌రింత సౌక‌ర్య‌వంతంగా వ‌స‌తి క‌ల్పించేందుకు టీటీడీ అచ్యుతం, శ్రీ‌ప‌థం వ‌స‌తి స‌మూదాయాలు నిర్మిస్తున్న‌ట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తిరుపతిలోని గోవింద‌రాజ‌స్వామి(రెండు), కోదండ‌రామస్వామి(మూడు) సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ,ఈవో ధర్మారెడ్డి తో కలసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా భూమన మీడియాతో మాట్లాడుతూ..సామాన్య‌ భ‌క్తుల‌కు ప్రాధాన్యం ఇస్తూ ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా శ్రీ‌వారి ద‌ర్శ‌నం, అన్నప్ర‌సాదం, బ‌స త‌దిత‌ర సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌న్నారు. భ‌క్తుల‌కు మ‌రింత మెరుగ్గా బ‌స క‌ల్పించ‌డంలో భాగంగా తిరుమ‌ల‌, తిరుప‌తిలో ఉన్న విశ్రాంతి గృహాల్లో అవ‌స‌ర‌మైన వాటిని ఆధునీక‌రిస్తున్న‌ట్లు తెలిపారు.

తిరుపతిలో దాదాపు 70 సంవ‌త్స‌రాల క్రితం నిర్మించిన‌ గోవిందరాజస్వామి సత్రం (రెండో సత్రం) స్థానంలో రూ.209 కోట్ల‌తో అచ్యుతం, కోదండరామస్వామి సత్రం(మూడో సత్రం) స్థానంలో రూ.209 కోట్లతో శ్రీపథం వసతి సముదాయాలు నిర్మించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింద‌న్నారు. ఒక్కో బ్లాకులో 4100 మంది చొప్పున మొత్తం 8200 మంది భ‌క్తులు ఇక్క‌డ‌ బ‌స చేసే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఇందులో దాదాపు 200కు పైగా కార్లు, ద్విచ‌క్ర‌వాహ‌నాలు పార్కింగ్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

Also Read:నడుంనొప్పితో బాధపడుతున్నారా?

- Advertisement -