టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రవణం విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ సోమవారం సాయంత్రం శ్రవణం కేంద్రాన్ని, చిన్నారుల శిక్షణ తరగతులను అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ, శ్రవణం కేంద్రంలోని విద్యార్థుల సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, చిన్నారులకు ప్రధాన సౌకర్యాలను త్వరలో కల్పిస్తామన్నారు. చిన్నారుల ఉంటున్న భవణం అక్కడక్కడా వర్షా కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి తమ దృష్టికి తీసుకువచ్చారని, త్వరలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
చిన్నారులకు వినికిడి యంత్రాలు సరఫరా చేయాలని, మరింతగా పౌష్టికాహారం అందించాలని వారి తల్లులు కోరారు. శ్రవణం భవణంలో అక్కడక్కడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, తక్షణమే సాంకేతిక అంశాలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
Also Read:Pushpa 2: నాలుగు రోజుల్లో రూ.829 కోట్లు