- Advertisement -
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల టీటీడీ పాలకమండలి సంచల నిర్ణయం తీసుకుంది. టీటీడీలో కాగ్ ద్వారా ఆడిటింగ్ జరపాలని పాలకమండలిలో తీర్మానించిన బోర్డు ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ప్రతి సంవత్సరం ఇంటర్నల్ ఆడిటింగ్‌తో పాటు ప్రభుత్వం ద్వారా ఎక్స్‌టర్నల్ ఆడిటింగ్ నిర్వహిస్తోంది టీటీడీ. అయితే, ఆదాయవ్యయాలపై తరుచూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నుంచే కాగ్ ద్వారా ఆడిటింగ్ జరగాలని టీటీడీ తీర్మానించింది.
టీటీడీలో కాగ్ ద్వారా విచారణ జరిపించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. ఈ నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం సంచలనం కాగా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
- Advertisement -