దేశంలో 40 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

111
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య 40 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 83,341 కరోనా కేసులు నమోదుకాగా 1096 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 39,36,748కు చేరింది. ఇందులో 8,31,124 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా 30,37,152 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.

క‌రోనాతో ఇప్పటివరకు 68,472 మంది మృతిచెందగా 24 గంటల్లో 11,69,765 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని ఐసీఎంఆర్ వెల్లడించింది. సెప్టెంబ‌ర్ 3 వ‌ర‌కు మొత్తం 4,66,79,145 టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది ఐసీఎంఆర్.