TTD:అంగ ప్రదక్షిణ టోకెన్లు ఆన్‌లైన్ కోటా

9
- Advertisement -

టీటీడీ శనివారం ఆగష్టు 10 వ తారీఖునకు సంబంధించిన మొత్తం 250 అంగ ప్రదక్షిణ టోకెన్‌లను ఆగస్టు 09 మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణం టోకెన్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.

తిరుమల ఆలయంలో శనివారం టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పారాయణ దారులు వేదశీర్వచనం చేశారు.

ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు వేలాదిగా విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా, స్నేహపూర్వకంగా అందిస్తామని చెప్పారు అదనపు ఈవో. టీటీడీలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

Also Read:రేవంత్‌కు పాలనపై పట్టులేదు: రాకేష్ రెడ్డి

- Advertisement -