టీటీడీ అలర్ట్..దర్శన వేళలు కుదింపు

190
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతుండగా దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇక ఈ నెల 25, నవంబర్ 8న సూర్య,చంద్ర గ్రహణాల కారణంగా దర్శన సమయాలను కుదించింది టీటీడీ.

అక్టోబర్‌ 25న సాయంత్రం 5.11నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉండనుండటంతో ఆరోజు ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. ఇక నవంబర్‌ 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 వరకు చంద్రగ్రహణం ఉండటంతో ఆరోజు ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 వరకు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దానికి అనుగుణంగా తిరుమలకు రావాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈ రెండు రోజుల్లో 12 గంటల పాటు స్వామివారి ఆలయం తలుపులు మూసివేస్తారు. గ్రహణాల రోజుల్లో బ్రేక్‌, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశామని.. కేవలం సర్వదర్శనం భక్తుకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.

- Advertisement -