పుష్ప 2..దీపావళి ట్రీట్

63
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 వస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో మేజర్ అసెట్‌గా నిలవగా…తాజాగా సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నట్లుగా ఓ ఫోటోను షేర్ చేశారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు సంబంధించి టెస్ట్ లుక్‌ను ప్రముఖ ఫోటోగ్రఫర్ అవినాష్ గోవారికర్‌తో నిర్వహించాడు దర్శకుడు సుకుమార్.

ఈ క్రమంలో సెట్‌లోని వర్కింగ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ టెస్ట్ లుక్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

- Advertisement -