రష్యాను సునామీ ముంచెత్తింది. కమ్చట్కా ద్వీపకల్పం తీరంలో తీవ్ర భూకంపం సునామీగా మారింది. 8.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తం అయ్యారు. అమెరికాలోని కాలిఫోర్నియా సహా పశ్చిమ రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.
3 మీటర్ల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది అమెరికా. జపాన్, హవాయి మరియు ఇతర పసిఫిక్ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్ని దశాబ్దాల్లో సంభవించిన అత్యంత తీవ్ర భూకంపం ఇదే.
ఈ భూకంపం భూమికి సుమారు 19 కిలోమీటర్ల లోతులో, పెట్రోపావ్లోవ్స్‌క్-కమ్చట్స్కీ అనే నగరానికి దక్షిణ–తూర్పు దిశగా 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రంగా నమోదైంది.సునామీ అలలు 4 మీటర్ల ఎత్తున నమోదయ్యాయని, కొన్ని ప్రాంతాల్లో నష్టాన్ని కలిగించాయని అధికారులు తెలిపారు.
Also Read:నింగిలోకి GSLV-F16
అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకూ ముప్పు పొంచి ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండాలి… సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు అధ్యక్షుడు ట్రంప్. కాలిఫోర్నియా, హవాయి, అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో ఉన్న భారత పౌరులకు కాన్సులేట్ హెచ్చరిక జారీ చేసింది.

