టీఎస్ఎస్‌పీడీసీఎల్ జూనియర్ లైన్‌మెన్ పరీక్ష రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జులై 17న వెయ్యి పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 181 మంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్ పాల్పడినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. హైదరాబాద్, రాచకొండ పోలీసులు విచారణ చేపట్టి.. నిర్ధారించారు. ఘట్‌కేసర్ పరీక్ష కేంద్రంలో మొబైల్ ఫోన్‌తో ఓ అభ్యర్థి పట్టుబడిన సంగతి తెలిసిందే. మాల్ ప్రాక్టీస్ అభ్యర్థి పట్టుబడటంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తమకు సమాధానాలు చెబుతామని డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఓ అభ్యర్థి అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు ఏడీఈలతో సహా ఐదుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. ఇప్పటికే పాత్ర ఉన్న ఆ ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ప్రకటించారు.
జూనియర్ లైన్‌మెన్ పరీక్ష రద్దు…మళ్లీ కోత్త నోటిఫికేషన్
- Advertisement -
- Advertisement -