దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు అవార్డుల పంట..

15

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 15వ ఇండియా ఎనర్జీ సమ్మిట్‌లో భాగంగా విద్యుత్ పంపిణీ – సంస్కరణలు మరియు సమర్ధత అంశంపై వివిధ రాష్ట్రాల డిస్కం యాజమాన్యాల, ప్రభుత్వ అధికారులతో ఆన్లైన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా, వివిధ కేటగిరీలలో విశిష్ట అభివృద్ధి కనబరిచిన విద్యుత్ పంపిణి సంస్థలకు అవార్డులు ప్రధానం చేసారు. వీటిలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థకు ఆరు పతకాలు లభించాయి. దేశంలోని అన్ని విద్యుత్ పంపిణి సంస్థలలో సమిష్టి ప్రతిభ కనబరిచిన TSSPDCL తెలంగాణకు మొదటి ర్యాంక్, BSES రాజధాని పవర్ లిమిటెడ్, న్యూఢిల్లీకి రెండో ర్యాంకు, APSPDCL ఆంధ్ర ప్రదేశ్‌కు మూడో ర్యాంకు లభించింది.

సామర్ధ్య నిర్వహణ లో మొదటి ర్యాంకు, వినియోగదారుల సేవలో మొదటి ర్యాంక్, నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలులో మొదటి ర్యాంక్, పనితీరు సామర్ధ్యం లో మొదటి ర్యాంక్, గ్రీన్ ఎనర్జీ విభాగంలో మూడో ర్యాంకులు TSSPDCLకు లభించాయి. సమావేశం లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు మాట్లాడుతూ అన్ని రంగాలవారికి నిరంతర విద్యుత్ సరఫరా, రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ విద్యుత్ సంస్థలను ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గౌరవరం రఘుమా రెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ పంపిణీ వ్యవస్థ రంగంలో రెగ్యులటరీ కమిషన్ చట్టం 1998, APDP,APDRP,విద్యుత్ చట్టం 2003, RGGVY 2005,R-APDRP 2008,IPDS 2014,DDUGJY 2015 వంటి పధకాల, చట్టాల అమలుతో విద్యుత్ పంపిణీ రంగంలో చాలా సంస్కరణలు జరిగాయని తెలిపారు. దీనికి తోడు పంపిణీ వ్యవస్థల ఆర్ధిక అభివృద్ధి కోసం సైతం SEB పధకం, FRP ప్లాన్, ఉదయ్ పధకం, ఆత్మనిర్బర్ పధకం RDSS వంటి పధకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం తమ రాష్ట్రంలో నున్న విద్యుత్ సంస్థల అభివృద్ధి కోసం వివిధ రకాలుగా తోడ్పాటు అందిస్తున్నది తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు హైదరాబాద్ నగరంలో రోజుకు మూడు నుండి నాలుగు గంటలు, పల్లెల్లో పట్టణాల్లో ఆరు నుండి ఎనిమిది గంటల విద్యుత్ కోతలు ఉండేవని, దీనికి తోడు పరిశ్రమలకు వారానికి రెండు రోజుల పవర్ హాలిడేలు ఉండేవని, ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్ రావు దిశానిర్దేశంతో రాష్ట్రం ఏర్పడ్డ కేవలం ఆరు నెలల్లో విద్యుత్ కొరతను అధిగమించామని సమావేశంలో తెలిపారు.

సంస్థ నిర్వహణ సామర్ధ్యం పెంపు కోసం 100% ఇన్ఫ్రారెడ్ సాంకేతికత కలిగిన మీటర్లను అమర్చడం, నిరంతర విద్యుత్ సరఫరా పర్యవేక్షణ కోసం స్కేడా ఏర్పాటు, నూతన సర్వీసుల మంజూరు, ఇతర సేవలు పొందటం కోసం ఆన్లైన్ ఆధారిత సేవలు, కాగిత రహిత సేవలు, స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ, 11 కేవీ ఫీడర్ల లో సరఫరా పర్యవేక్షణ కోసం రూట్ దాస్ టెక్నాలజీ, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అధునాతన కాల్ సెంటర్, TS ఐపాస్ కు, ఇతర సేవలకు వెబ్ పోర్టల్, సంస్థ మొబైల్ ఆప్, డిజిటల్ పేమెంట్ సౌకర్యం, SASA మొబైల్ ఆప్, ఊర్జా మిత్ర వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నామన్నారు. గ్రీన్, క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూఫ్ టాప్ సోలార్ నెట్ మీటరింగ్, ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ, కుసుమ్ వంటి వాటిని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.

సీఎండీ జి రఘుమా రెడ్డి మాట్లాడుతూ, ఈ విజయానికి కారణమైన ముఖ్య మంత్రి కే చంద్ర శేఖర్ రావుకి, విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి గారికి, ఇంధన శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, IASకి మరియు అన్ని విధాలుగా ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తున్న TS ట్రాన్స్కో & జెన్ కో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డి ప్రభాకర్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి, సంస్థ డైరెక్టర్ లకు అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సదస్సులో సంస్థ సీఎండీ జి రఘుమా రెడ్డితో పాటు, గణేష్ శ్రీనివాసన్, సీఈఓ, TPDDL, అమల్ సిన్హా, డైరెక్టర్ & గ్రూప్ సీఈఓ, BSES, ఢిల్లీ, సురేష్ కుమార్, IAS, అదనపు చీఫ్ సెక్రటరీ, విద్యుత్ శాఖ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, విజయ్ సింఘాల్, IAS, CMD, MSEDCL, నిహారి భికుంజ ధల్, IAS, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒడిశా ప్రభుత్వం, అనిల్ రజ్దాన్, ICC తదితరులు పాల్గొన్నారు.