టీఎస్ఎస్పీకి కొత్త సచివాలయం భద్రత బాధ్యత

236
ts
- Advertisement -

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సమీకృత కొత్త సచివాలయం బాహ్యరక్షణ బాధ్యతలను తెలంగాణా స్పెషల్ పోలీస్ వింగ్ చేపట్టబోతోంది. ఈమేరకు ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు ఇవాళ డీజీపీకి వెళ్లాయి. సెక్రటేరియట్ కు పహారాకాసే టీఎస్ఎస్పీ బలగాలకు ఆక్టోపస్ తరహా ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నారు. ఇక కొత్త సచివాలయం లోపలి భద్రత బాధ్యతలను ఎప్పటిలాగే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్డబ్ల్యూ) నిర్వర్తిస్తుంది.

తెలంగాణా పోలీసులోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) వింగ్ ఇంతకాలం సచివాలయం భద్రతా బాధ్యతలను భుజస్కంధాలపై మోసింది. ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రాచీన దేవాలయాల భద్రతను సైతం ప్రస్తుతం ఎస్పీఎఫే చూస్తోంది. ఆ రివాజుకు భిన్నంగా ఇప్పుడు ప్రభుత్వం కొత్త సచివాలయం భద్రతా వ్యవహారాలను పోలీసుశాఖలోని మరో విభాగానికి అప్పగించడం పట్ల ఎస్పీఎఫ్ లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సమీకృత సచివాలయంలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -