టీఎస్ఆర్‌టీసీలో లహరి బస్సులు…

136
- Advertisement -

బస్సు ప్రయాణికులకు టీఎస్ఆర్‌టీసీ మెరుగైన సేవల్ని అందించేందుకు సిద్దమైంది. జనవరి 4నుంచి స్లీపర్‌ క్లాస్‌ బస్సుల్ని ప్రవేశపెట్టనుంది. లహరి పేరుతో నూతన బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. ఇందులో స్లీపర్ క్లాస్‌ ఉండటం దీన్ని ప్రత్యేకత. కేపీహెచ్‌బీ కాలనీలోని బస్ స్టాప్ వద్ద బుధవారం నుంచి ఈ సర్వీసుల్ని టీఎస్ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎండీ సజ్జనార్‌ చేత ప్రారంబించనున్నారు.

హైదరాబాద్‌ నుంచి కాకినాడ విజయవాడల మధ్య ప్రయాణం కొనసాగనున్నాయి. మొత్తం పది బస్సులు అందుబాటులో కలవు. ఇందులో నాలుగు బస్సులు పూర్తిగా స్లీపర్ బస్సులు కాగా మిగిలినవి స్లీపర్ కమ్‌ సీటర్ బస్సులు నడవనున్నాయి. ఇప్పటివరకు ప్రైవేట్ ట్రావెల్స్‌లో మాత్రమే స్లీపర్ బస్సులు ఉన్నాయి. దీంతో మొదటిసారి ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీఎస్ఆర్టీసీ బస్సులో ఈ స్లీపర్ బస్సుల్ని తీసుకవస్తోంది. ఇవి ఎక్కువగా కాకినాడ విజయవాడవైపు ప్రయాణం చేసే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.

ప్రతిరోజు బీహెచ్‌ఈఎల్‌ నుంచి రాత్రి 7.45 8.30 గంటలకు బయల్దేరుతాయి. కాకినాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే బస్సులు ప్రతి రోజు రాత్రి 7.15 7.45 బయల్దేరనున్నాయని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ ప్రకటించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులు ప్రతి రోజూ ఉదయం 10.15 గంటలకు, 11.15 గంటలకు, మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు బయల్దేరుతాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులు ప్రతిరోజూ మియాపూర్ నుంచి ఉదయం 09.30 గంటలకు, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30 గంటలకు, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి.

ఇవి కూడా చదవండి…

భారీగా పెరిగిన బంగారం ధర..

కిస్‌మిస్‌ పండ్లతో ఆరోగ్యం..

‘శలభాసనం’ వేస్తే ఇన్ని ఉపయోగాలా !

- Advertisement -