ఇంటికే రామయ్య కల్యాణ తలంబ్రాలు…

138
talambralu
- Advertisement -

రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీరామ కళ్యాణం, పట్టాభిషేకం ఘనంగా జరిగింది. పట్టాభిషేక వేడుకకు గవర్నర్ తమిళి సై హాజరుకాగా ఇక సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ కార్గో చేసిన ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా 88,704 మంది భక్తులు సీతారాముల కల్యాణ తలంబ్రాలను బుక్‌ చేసుకోగా ఆర్టీసీకి మంచి ఆదాయం లభించింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తొలి బుకింగ్‌ నమోదు చేసుకున్నారు. రూ.80 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉండగా రూ.70,96,320 ఆదాయం సమకూరింది.

మంగళవారంనాటికి తలంబ్రాలతో కూడిన పొట్లాలు సంబంధిత జిల్లాలకు చేరతాయి. బుధవారం నుంచి భక్తులకు అందజేయనున్నారు.

- Advertisement -