సమ్మతిపత్రాలు ఇచ్చి విధుల్లో చేరుతున్న కార్మికులు..

449
ts rtc
- Advertisement -

మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లో చేరని కార్మికులను ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ ఇంతకుముందే ఆర్టీసీ కార్మికులకు 5వ తేదీ వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి గత నాలుగు రోజులుగా వారి వారి డిపోలలో తిరిగి ఉద్యోగాలలో చేరుతున్నారు. ఈనే పథ్యంలో మరికొందరు కార్మికులు డ్యూటీలో జాయిన్‌ అయ్యారు.

rtc Employees

సోమవారం సాయంత్రం N భాస్కర్ (201320) SDI కాచిగూడ డిపో సీనియర్ డ్రైవర్ ఇన్స్పెక్టర్ డిపో మేనేజర్‌కి లెటర్ వ్రాసి ఇచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అలాగే ఈ రోజు (మంగళవారం) మేడ్చల్ డిపోలో విధులోకి చేరుతానని డిపో మేనేజర్ ప్రకాశరావు కు సమ్మతి పత్రాన్ని కండక్టర్ (271526) m విజయకుమార్ అందచేశారు.. హైదరాబద్‌లోని బర్కత్‌పురా డిపోలో ఈ రోజు ఉదయం K వెంకటేష్ (222067) కండక్టర్ డిపో మేనేజర్‌కి లెటర్ వ్రాసి ఇచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు.

TSRTC Employees to Rejoin

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోలో ఆలీబాబా (321432) మెకానిక్ విధుల్లో చేరుతున్నట్లు డిఎంకు అంగీకార పత్రం అందజేసినారు. ఈ రోజు ఉదయము సిద్దిపేట డిపో లో పనిచేస్తున్న Ch. బుచ్చిరామ్ రెడ్డి ,(250650) ADC(Assistant Depo Cleark),సమ్మె విరమించి విధులలో చేరుతున్నట్లు ACP సిద్దిపేటకి దరఖాస్తు ఇచ్చినారు.

- Advertisement -