ఛార్జీలు తగ్గించిన టీఎస్ఆర్టీసీ..

57
rtc
- Advertisement -

ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందించింది టీఎస్ఆర్టీసీ. తాజాగా గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణీకులకు విలాసవంతమైన ప్రయాణం చేసేందుకు వీలుగా నడుస్తున్న ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా సవరించారు.

ఈ సవరించిన / తగ్గించిన ఛార్జీలు షెడ్యూల్ , ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నాయి. అంతరాష్ట్ర సర్వీసులో అయితే తెలంగాణ సరిహద్దు దాటిన తరువాత అంతకు మునుపు ఉన్న అంతరాష్ట్ర భాగంలో వర్తించే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.

రవాణా రంగంలో ఉన్న పోటీని తట్టుకుని నిలబడడానికి ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సజ్జనార్ అన్నారు. హైదరాబాద్ – విజయవాడ మధ్య రూ .100 , హైదరాబాద్ – ఆదిలాబాద్ మధ్య రూ .111 , హైదరాబాద్ – భద్రాచలం మధ్య రూ .121 , హైదరాబాద్- వరంగల్ మధ్య రూ .54 లు తగ్గినట్లు ఆయన వివరించారు.

- Advertisement -