సంబురాల సంక్రాంతికి 4233బస్సులు….

100
- Advertisement -

సంక్రాంతి పండుగ వచ్చింది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో లొగిల్లో ముగ్గులతో ఆడపడుచులు తలమునకలైపోతారు. ఈ పండుగ రద్ధీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం 4200ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించింది.

585 సర్వీసులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించడంతోపాటు మిగిలిన వాటిని యధావిథిగా నడుపనుంది. ప్రత్యేక బస్సులను జనవరి 7 నుంచి 15వరకు నడుపనున్నట్టు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. గతేడాదితో పోలిస్తే ఈ సంక్రాంతికి 10శాతంఅదనపు బస్సులను ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేసేందుకు వినియోగిస్తున్నట్టు సజ్జనార్ వెల్లడించారు.

సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రప్రదేశ్‌ లో ప్రధానమైన పండుగ. కావున దీన్ని దృష్టిలో ఉంచుకొని అమలాపురానికి 125 కాకినాడ 117 కందుకూరు 83 విశాఖపట్నం65 పోలవరం 51 రాజమండ్రికి40 ప్రత్యేక బస్సులను నడుపాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్ సౌకర్యంను కల్పించనున్నారు. అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం 30రోజుల నుంచి 60రోజులకు పెంచినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవంది…

ఇస్రో హైపర్ సోనిక్ సక్సెస్‌…

లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…

బొప్పాయి తింటే.. నిజంగానే గర్భం పోతుందా ?

- Advertisement -