‘సైరా’కు సుబ్బరామిరెడ్డి ప్రశంసలు..

224
- Advertisement -

కళాబంధు డా: టి. సుబ్బారామిరెడ్డికి ఇటీవల విదేశాలలో మోకాలుకి శస్త్ర చికిత్స జరిగింది. నగరానికి విచ్చేసిన సుబ్బారామిరెడ్డిని ఆయన స్వగృహంలో మెగాస్టార్. చిరంజీవి పరామర్శించారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు డా: టి. సుబ్బారామిరెడ్డి.

Megastar Chiranjeevi

ఈ సందర్భంగా చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉందని, సినిమా ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోతుందని టి. సుబ్బారామిరెడ్డి అభిలషించారు. అలాగే చిత్ర సమర్పకురాలు శ్రీమతి సురేఖకి, చిత్ర నిర్మాత రాంచరణ్‌కు, దర్శకుడు సురేందర్ రెడ్డికి చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.

- Advertisement -