చిరుకు టీఎస్‌ఆర్‌ ఆత్మీయ సభ….

209
TSR felicitates Megastar
- Advertisement -

టాలీవుడ్ స్క్రీన్ పైకి దాదాపు దశాబ్దం తర్వాత వచ్చినా తన రేంజ్ ఏంటో సింగిల్ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు చిరంజీవి. ఖైదీ నంబర్ 150 సాధిస్తున్న వసూళ్లు ట్రేడ్ జనాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. అసలు ఎంట్రీ సాఫీగా ఉంటుందా అనే అనుమానాలతో మొదలై.. టాలీవుడ్ రికార్డులను తిరగరాసేస్తున్నారంటే అది కేవలం చిరంజీవికే సాధ్యం.

TSR felicitates Megastar

రీఎంట్రీలో మెగాస్టార్ సాధించిన ఘనవిజయాన్ని పురస్కరించుకుని.. ఇండస్ట్రియలిస్ట్ కం ఫిలిం మేకర్ అయిన టి. సుబ్బిరామిరెడ్డి ఓ ఆత్మీయ వేడుక నిర్వహించారు. మెగాస్టార్ ను అభినందించేందుకే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ‘9ఏళ్ల తర్వాత వచ్చినా మెగాస్టార్ చిరంజీవి నటించి ఖైదీ నంబర్ 150 చిత్రంతో.. కేవలం వారం రోజుల్లో 100 కోట్ల వసూళ్లు రాబట్టడం.. ఆయన ప్రతిభకు నిదర్శనం. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అదే ఉత్సాహం కనిపిస్తోంది. గతంలో మెగాస్టార్ తో నేను స్టేట్ రౌడీ అనే మూవీ తీయగా.. ఆ చిత్రం ఎన్నో రికార్డులను సృష్టించింది. చిరంజీవితో నా అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే’ అని చెప్పారు సుబ్బిరామి రెడ్డి.

TSR felicitates Megastar

పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఈ ఆత్మీయ వేడుకకు నాగార్జున.. అమల.. శ్రీకాంత్.. బ్రహ్మానందం.. జయప్రద.. ఛార్మీ.. అశ్వినీదత్.. దిల్ రాజు వంటి సినిమా రంగ ప్రముఖులు హాజరయ్యారు.

- Advertisement -