తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ జాతర కొనసాగుతోంది. తాజాగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులు భర్తీ చేయనుంది. గతంలో 1032 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. తాజగా ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున్న నోటిఫికేషన్‌లు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్1 ప్రిలిమ్స్ పూర్తయ్యాయి. ఈ రిజల్ట్స్ కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. గ్రూప్4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతాయని ప్రకటించింది. వీటితో పాటుగా హాస్టల్ వార్డెన్, హార్టికల్చర్, వెటర్నరీ, పోలీసు శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
పోస్టుల వారీగా ఏ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..?
- మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 పోస్టులు – 11
- కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ – 59
- ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో నయిబ్ తహసిల్దార్ పోస్టులు – 98
- రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్‌లో సబ్-రిజిస్ట్రార్ ఖాళీలు – 14
- రిజిస్ట్రార్ ఆఫ్ కో- ఆపరేటివ్ సొసైటీస్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఫర్ కో-ఆపరేషన్ పోస్టులు - 63
- కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఖాళీలు – 09
- పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో మండల పంచాయత్ ఆఫీసర్ (ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్) పోస్టులు – 126
- ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్- 97
- హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్ డిపార్ట్‌మెంట్‌లో- అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ – 38
- జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీలు – 165
- లెజిస్లేటివ్ సెక్రెటేరియట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 15
- ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 25
- న్యాయ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 07
- తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 02
- జువెనైల్ కరెక్షనల్ సర్వీసెస్, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్‌లో డిస్ట్రిక్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులు – 11
- బీసీ సంక్షేమ శాఖలో అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ – 17
- గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ – 09
- షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ – 17
ఇవి కూడా చదవండి…
ఇన్‌ఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
అత్యంత పొడవైన స్కైవాక్ ఎక్కడంటే…
దేశంలో తొలి 3డీ ఇల్లు ఎక్కడంటే…