తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..

329
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని ఉద్యోగల భర్తీకి రంగం సిద్ధం చేసింది . రాష్ట్రంలోని పలు విభాగాల్లో 93 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టిఎస్‌పిఎస్సీ) జారీ చేసింది. శుక్రవారం పురపాలకశాఖలో 85 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పురపాలకశాఖలో 50 హెల్త్ అసిస్టెంట్లు, 35 శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థలో 8 ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి మరో ప్రకటన విడుదల చేసింది. శానిటరీ ఇన్స్‌స్పెక్టర్ల భర్తీకి ఈనెల 31వ తేదీ నుంచి వచ్చే ఆగస్టు 8వ తేదీ వరకు, హెల్త్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆగస్టు 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌ పొందుపరిచారు.

 TSPSC Job Notification 2018

అంతేకాకుండా ఇదివరకే పలు పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు మరో మూడురోజులు గడువు పొడిగించే అవకాశం కల్పించినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. వైద్యారోగ్యశాఖలోని స్టాఫ్‌నర్స్, ఫిజియోథెరపిస్ట్, రేడియోగ్రాఫర్, పారామెడికల్ ఆప్త్తాల్మిక్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గడువును ఈ నెల 30 వరకు పొడిగించారని తెలిసింది. వీటితోపాటు..చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

- Advertisement -