పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన త‌మన్నా..

357
Tamannaah

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా పెళ్లి చేసుకోబుతుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతుంద‌ని వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి. అయితే సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించింది త‌మ‌న్నా. త‌న ట్వీట్ట‌ర్ ద్వారా ఒక పెద్ద మెసెజ్ ను పోస్ట్ చేసింది. ఒక రోజు యాక్ట‌ర్… మ‌రో రోజు క్రికెట‌ర్..ఇప్ప‌డు డాక్ట‌ర్..ఎంటీ ఇలా నా పెళ్లి గురించి రూమ‌ర్స్ ..నేను ఏమ‌యినా భ‌ర్త‌లను షాపింగ్ చేస్తున్న‌ట్లుగా అనిపిస్తుంది.

tamanna

ల‌వ్ ఉండ‌టం అనే అనుభూతి మంచిదే కానీ నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఆధారాలు లేకుండా ఇలా రాయ‌డం త‌న‌కు న‌చ్చ‌డం లేద‌న్నారు. నేను సింగిల్ గానే హ్యాపిగా ఉన్నాను..మా ఇంట్లో కూడా నాకు పెళ్లి సంబంధాలు చూడ‌టంలేదు..మా అమ్మ నాన్న‌లు కూడా ఆవిష‌యంపై ఆలోచించ‌డం లేదు. నా దృష్టి అంతా సినిమాపైనే..నా ప‌ని నేను చూసుకుంటుంటే ఈరూమ‌ర్లు ఎలా వ‌స్తున్నాయ‌ని ప్ర‌శ్నించింది. అస‌లు పెళ్లి ఆలోచ‌న ఉంటే నేను మికు చెప్తాను అని తేల్చి చెప్పింది.

ఇప్ప‌ట్లో నేను పెళ్లి చేస‌కోవ‌డం లేదు..ఒక‌వేళ చేసుకుంటే మీకు త‌ప్ప‌కుండా స‌మాచారం ఇస్తాన‌ని పోస్ట్ చేసింది. త‌మ‌న్నా పెళ్లి విష‌యంపై గ‌తంలో రెండు మూడు సార్లు రూమ‌ర్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. గ‌తంలో ఓ స్టార్ హీరోను త‌మ‌న్నా పెళ్లి చేసుకోనుంద‌ని..ఆత‌ర్వాత ఓ క్రికెట‌ర్ తో ల‌వ్ లో ఉంద‌ని త్వ‌ర‌లో పెళ్లీ కూడా చేసుకోబోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం త‌మ‌న్నా తెలుగు, త‌మిళ్, హిందీ సినిమాల్లో బిజీగా ఉంది. చిరంజీవి సైరా సినిమాలో కూడా త‌మ‌న్నా న‌టిస్తుంది.