దరఖాస్తుల సవరణకు అవకాశం : టీఎస్‌పీఎస్సీ

37
tspsc
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం 90,000లకు పైగా కొలువుల జాతర నిర్వహిస్తుంది. దానిలో భాగంగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అందులో 503 పోస్టులను భర్తీ చేయనుంది. కాగా టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు దరఖాస్తుల సవరణ చేసుకొనే అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్‌ చేసుకోవచ్చని తెలిపింది.

అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను ఎడిట్‌ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, సవరణలకు తగిన ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్‌ను అక్టోబర్‌ 16 నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్‌పీఎస్పీ తెలిపింది. మెయిన్స్‌ను జనవరి లేదంటే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది.

- Advertisement -