గ్రూప్‌-2 సిలబస్‌లో స్వల్ఫ మార్పులు

27
- Advertisement -

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్న వేళ టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 783పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2లో సిలబస్‌లో స్వల్ప మార్పులు చేసింది. గ్రూప్‌-2లో మొత్తం నాలుగు పేపర్లకుగాను 600మార్కులకు జరుగుతుంది. అయితే టీఎస్‌పీఎస్సీ పేపర్‌-2లో స్వల్ఫ మార్పులు చేసింది. పెద్ద మొత్తంలో పేపర్‌-3లో చేసింది. అయితే పేపర్-1,4లో మార్పులు ఏమిచేయలేదు. వాటిని యథాతథంగా ఉంచింది.

పేపర్‌-2 రెండో సెక్షన్‌ లోని పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, సవరణ చట్టాలను చేర్చారు. జాతీయ సమగ్రత, అంతర్గత భద్రత, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలను చేర్చారు. పేపర్‌-2లోని 3వ సెక్షన్‌ లో భారతీయ సాంఘిక నిర్మాణంలో ఎథ్నిసిటీ, మతం – మహిళలు అనే అంశాన్ని జత చేశారు.

పేపర్‌-3 లోని ఒకటో సెక్షన్‌ లో జనాభా శాస్త్రం, ప్రాథమిక, ద్వితీయ రంగాలు, పరిశ్రమలు, సేవారంగం, ప్లానింగ్‌, నీతిఆయోగ్‌-పబ్లిక్‌ ఫైనాన్స్‌ అదనంగా చేర్చారు. రెండో సెక్షన్‌ లో తెలంగాణ ఎకానమీ నిర్మాణం, వృద్ధితో పాటు జనాభా-మానవవనరుల అభివృద్ధి, వ్యవసాయం-అనుబంధ రంగాలు, పరిశ్రమలు-సేవా రంగాలు, రాష్ట్ర ఫైనాన్స్‌, బడ్జెట్‌, పాలసీలు కొత్తగా చేర్చారు. మూడో సెక్షన్‌లో అభివృద్ధి-అండర్‌ డెవలప్‌మెంట్‌, పేదరికం-నిరుద్యోగిత, పర్యావరణం- సుస్థిర అభివృద్ధిని కొత్తగా తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి…

బరువు తగ్గాలనుందా..అయితే మీకోసమే!

స్వామివారికి స్వర్ణ కిరీటం..

వైకుంఠ ఏకాదశి విశిష్టత..

- Advertisement -