మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎనివిఎస్ ప్రభాకర్ మాటలు పూర్తి అవాస్తవం. ఆయన మాటలు నేను ఖండిస్తున్నాను. అబద్దాలు ఆడడంలో ఆయనను మించిన వారు లేరు అని టీఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇటివల జరిగిన జెమ్ టెండర్లకు వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావు ఎలాంటి సంబంధం లేదు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ నాయకులు. ఢిల్లీ నుండి గల్లీ దాకా ఈ బీజేపీ లీడర్లు అబద్దాలు మాత్రమే ప్రచారం చేస్తారు.జోక్ ఆఫ్ ది ఇయర్‌గా మాజీ ఎమ్మెల్యే ఎనివిఎస్ ప్రభాకర్ మాటలు నిలుస్తాయి. కొంత మందికి తొత్తులుగా మాట్లాడుతున్నారు ఈ బీజేపీ నాయకులు. రెండు ఏజన్సీల పంచాయితీని రాష్ట్ర ఆరోగ్య శాఖకు అంటగట్టడం అవగాహన రాహిత్యం దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక లకు అనుగుణంగా జెమ్ టెండర్‌లు వేయడం జరిగింది. రెండు ఏజెన్సీ ల పంచాయితీని ఆరోగ్య శాఖకు అంటకడితే సహించం ఊరుకునేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేస్తే ఊరుకునేది లేదు. ఒక్కరికి తొత్తుగా వ్యవహరించడం ఈ బీజేపీకి దిక్కుమాలిన చర్య. ఈ టెండర్ ల ఇష్యు కోర్టులో ఉంది కోర్టు ఆదేశాల మేరకు పని చేస్తాం. ప్రభుత్వం మీద ఉరికనే బురద చల్లితే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అక్రమార్కులకు,అవినీతి పరులకు కేరాఫ్ అడ్రస్ మీ బీజేపీ పార్టీ,నేతలు ఉంటారు. దమ్ముంటే రుజువు చెయ్యి లేదంటే ముక్కు నేలకు రాయి. ఆరోపణలు చేసేముందు అవగాహన ఉండాలి ఆయనకు ఎలాంటి అవగాహన లేకుండానే ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడితే ఎలా ధ్వజమెత్తారు.