తెలంగాణలో వెలువరించిన పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి 2023 జనవరి 3వ తేదీ వరకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనున్నామని టీఎస్‌ఎల్‌ఆర్బీ ఇది వరకే తెలిపింది. కాగా నేటి దేహ దారుడ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో 11కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసింది. కాగా ప్రాథమిక పరీక్షల్లో ఎస్‌ఐ అభ్యర్థులు 1,05,603మంది, సివిల్ కానిస్టేబుల్ 1,84,861 మంది, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ 18,758 మంది, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ 1,09,518 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఈవెంట్స్‌కు ఆర్హత సాధించిన అభ్యర్థులు తమకు నిర్దేశించిన కేంద్రానికి వెళ్లి ఉదయం 6 గంటల లోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం(క్యాస్ట్ సర్టిఫికెట్), అడ్మిట్ కార్డు, పార్ట్-2 అప్లికేషన్ ఫారమ్‌తో పాటు ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ కూడా తీసుకెళ్లాలి. ఈ పత్రాలపై తప్పనిసరిగా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు తప్పనిసరి ఉండాలని సంబంధిత వెబ్‌సైట్లో పెట్టామని తెలిపింది.
- పురుష అభ్యర్థులు 7 నిమిషాల 15 సెకన్లలో 1600 మీటర్ల పరుగు పూర్తి చేయాలి. అనంతరం ఎత్తును కొలుస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే 9 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
- మహిళా అభ్యర్థులు 5 నిమిషాల 20 సెకన్లలో 800 మీటర్ల పరుగును పూర్తి చేయాలి.
- పురుషులు లాంగ్ జంప్ 4 మీటర్లు ఆపైన చేయాలి. మహిళలు 2.50 మీటర్లు, ఆపై చేయాల్సి ఉంటుంది.
- పురుషులు షార్ట్ పుట్(7.26 కేజీలు) 6 మీటర్లు, ఆపైన విసరాలి. మహిళలు షాట్ పుట్(4 కేజీలు) 4 మీటర్లు, ఆపైన విసరాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి…
పల్లె దవాఖానా…1492వైద్యులు
గ్రహాంతర వాసులది కాదు…మనదే
నాటి కలలు…నేడు నిజాలు:సీఎం