- Advertisement -
కరోనా కట్టడిలో భాగంగా తనవంతు సాయాన్ని అందించింది టీఎస్ఐఐసీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా రూ. కోటి 19 లక్షలను ప్రభుత్వానికి అందించింది. టీఎస్ఐఐసీ కార్పొరేషన్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ కమిషనర్ రాహుల్ బొజ్జా కు అందించారు.
- Advertisement -