సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం:సచివాలయ ఉద్యోగులు

220
narender rao
- Advertisement -

తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్….ప్రభుత్వ ఖర్చుతో మరింత విశాలంగా ప్రార్ధనా మందిరాలను నిర్మిస్తామని ప్రకటించారు.

కొత్త సచివాలయంలో మందిరం, మస్జీద్ లను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నరేందర్‌ రావు. ప్రస్తుతం ఉన్నదానికంటే ఎక్కువ స్థలంలో మరింత గొప్పగా గుడి, మసీదులను నిర్మిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు సచివాలయ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు మంగమ్మ.

పూర్తి ప్రభుత్వ ఖర్చుతో ప్రస్తుతం కంటే ఎక్కువ స్థలంలో కొత్త మసీదును నిర్మించడానికి నిర్ణయం తీసుకున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి షేక్ యూసుఫ్ మియా.

- Advertisement -