- Advertisement -
తెలంగాణ పాలిసెట్ ర్యాంకులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. నాంపల్లిలోని రుసా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన ఫలితాలను వెల్లడించారు. మొదటి ర్యాంకును వరంగల్‌కు చెందిన డి. నీరజ్‌దత్తు, రెండో ర్యాంకును మంచిర్యాలకు చెందిన వై. సింధు సాధించారు.
ఏప్రిల్ 22న జరిగిన పాలిసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,28,118 మంది హాజరుకాగా.. 1,09,058 మంది విద్యార్థులు అర్హత సాధించారు. బాలికలు 43,436, మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 65,622 మంది ఉత్తీర్ణత సాధించారు. పలితాల్లో 85.13 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
రాష్ర్టంలో 58 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 12250 సీట్లు మరియు 149 ప్రైవేటు, 2వ షిఫ్టు ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 41220 సీట్లు ఉన్నాయి. మే 3వ వారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
- Advertisement -