పుట్టిన రోజున మొక్కలు నాటిన కోలేటి దామోదర్..

164
Koleti Damodar
- Advertisement -

తెలంగాణ రాష్త్ర పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా శనివారం రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మరియు నా జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ గారు పిలుపు మేరకు మొక్కను నాటిని.. అలాగే ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్‌ కుమర్‌కు కృతజ్ఞతలు తెలిపారు కోలేటి దామోదర్.

- Advertisement -