- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ)లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తులను స్వీకరించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను సోమవారం జారీచేసింది. ఈ నెల 23 నుంచి 25 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని విద్యాశాఖ అధికారి తెలిపారు.
కేజీబీవీలలో పనిచేస్తున్న ఎస్వో, పీజీసీఆర్టీ, సీఆర్టీ, పీఈటీ, ఏఎన్ఎం బదిలీలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు, సంబంధిత మార్గదర్శకాలు తదితర వివరాల కోసం www.samagrashiksha.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
- Advertisement -