జూలైలో ఇంటర్ పరీక్షలు…!

126
ts
- Advertisement -

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని రకాల పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు రద్దుకాగా తాజాగా ప‌రీక్ష‌ల నిర్వాహ‌ణ విష‌యంపై కేంద్రానికి రాష్ట్ర విధ్యాశాఖ త‌న అభిప్రాయం తెలిపింది.

జూలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఆగ‌స్టు చివ‌రి నాటికి ఫ‌లితాలు విడుద‌ల చేస్తామ‌ని తెలిపింది విద్యాశాఖ. గ‌తంలోనే ప్ర‌శ్నాప‌త్రాల ముద్ర‌ణ పూర్త‌య్యాయని, మార్చ‌డం కుద‌ర‌ద‌ని తెలిపింది. ప‌రీక్ష‌ల స‌మ‌యాన్ని మూడు గంట‌ల నుంచి గంట‌న్న‌రకు కుదిస్తామ‌ని, రాయాల్సిన ప్ర‌శ్న‌లను కూడా కుదిస్తామ‌ని, విద్యార్ధుల‌కు ప్ర‌శ్న‌ల‌కు సంబందించిన ఛాయిస్ పెరుగుతుంద‌ని తెలిపింది. ప‌రీక్ష‌లు రాసేందుకు వీలు క‌ల‌గ‌ని విద్యార్దుల‌కు మ‌రోక అవ‌కాశం కూడా క‌ల్పిస్తామ‌ని విద్యాశాఖ కేంద్రానికి తెలియ‌జేసింది.

- Advertisement -