- Advertisement -
తెలంగాణలో ఇంటర్ రీ వెరిఫికేషన్ ఫలితాలు వెల్లడయ్యాయి. రీ వెరిఫికేషన్‌లో 1,137 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఫెయిలైన 3.82 లక్షల విద్యార్థుల సమాధాన పత్రాల రీవెరిఫికేషన్ పూర్తయింది. 19,788 జవాబు పత్రాల స్కానింగ్ పూర్తి కావాల్సి ఉందని, ఈ రాత్రికి, లేదా రేపు అప్‌లోడ్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
రీవెరిఫికేషన్‌లో 552 మంది ఇంటర్ సెకండియర్, 585 మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పాసైన విద్యార్థుల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌లో వచ్చిన మార్కులను మూడు రోజుల్లో వెల్లడిస్తామన్నారు. రీవెరిఫికేషన్‌కు ఫీజు చెల్లించిన విద్యార్థులకు జూన్ 12 తరువాత తిరిగి చెల్లిస్తామని చెప్పారు.
- Advertisement -